Shubhanshu Shukla: భారత అంతరిక్ష చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా ఇప్పుడు భారత్‌కు తిరిగి వస్తున్నారు. ఇటీవల విజయవంతమైన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా రోదసిలో గడిపిన ఆయన, స్వదేశానికి రాగానే ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా శుక్లా తన రాకను ధృవీకరించారు. “యాక్సియం-4 మిషన్ విజయవంతమైన తర్వాత నేను మొదటిసారి భారత్‌కు వస్తున్నాను” అని తెలిపారు. మిషన్ కోసం గత ఏడాదిగా తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం తనను బాధించిందని, ఇప్పుడు వారిని కలిసి తన అనుభవాలను పంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఆయన చెప్పారు. విమానంలో కూర్చున్న ఒక ఫోటోను కూడా ఆయన పంచుకున్నారు.
Also Read: IB Recruitment 2025: 10th పాస్ అయ్యారా.. వెంటనే అప్లై చేయండి.. రూ. 69,100 జీతం
అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఆదివారం (ఆగస్టు 17, 2025) భారత్‌కు రానున్న శుక్లా, సోమవారం (ఆగస్టు 18, 2025) ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ దినోత్సవం అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాలను గుర్తుచేస్తుంది.
ఈ మిషన్ ఇటీవల విజయవంతంగా పూర్తయింది. శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ (పోలాండ్), టిబర్ కపులతో కూడిన వ్యోమగాముల బృందం అంతరిక్షంలో 18 రోజులు గడిపింది. ఈ సమయంలో వారు మానవజాతికి ప్రయోజనం చేకూర్చే అనేక ప్రయోగాలను నిర్వహించారు. జూలై 15న వారు భూమికి తిరిగి వచ్చారు.