Nara Lokesh

Nara Lokesh: తిలక్ వర్మ బహుమతి: “నాకెంతో ప్రత్యేకం” – మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: ఆసియా కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పాకిస్థాన్‌ను ఓడించి తొమ్మిదో సారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయం తర్వాత తిలక్ వర్మ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఓ ప్రత్యేక బహుమతిని అందించాడు. తిలక్ వర్మ, ఫైనల్ మ్యాచ్‌లో తాను ధరించిన క్యాప్‌ను నారా లోకేశ్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు.

ఈ క్యాప్‌పై తన సంతకం చేస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. క్యాప్‌పై “డియర్ లోకేష్ అన్నా, లాట్స్ ఆఫ్ లవ్” అని రాసి, ఈ బహుమతిని ప్రేమతో అందిస్తున్నట్లు తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి నారా లోకేశ్ ఈ బహుమతికి సంతోషం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ, “తమ్ముడు తిలక్ వర్మ, నీ బహుమతి నాకు చాలా ప్రత్యేకం. నీవు భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు నీ చేతుల నుండి ఈ క్యాప్‌ను తీసుకోవడానికి ఎదురుచూస్తున్నా” అని పోస్ట్ చేశారు.

Also Read: Asia Cup trophy: నఖ్వీది పిల్ల చేష్టలు.. ఆ ట్రోఫీని తీసుకెళ్లే హక్కు అతనికి లేదు – బీసీసీఐ కార్యదర్శి ఫైర్

ఈ ఆసియా కప్ విజయం భారత అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో పాటు, ఈ బహుమతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు ప్రముఖులు తిలక్ వర్మను, భారత జట్టును ప్రశంసించారు. తిలక్ వర్మ ఈ విజయంతో తెలుగు రాష్ట్రాల్లో గర్వకారణంగా నిలిచాడు. అతడి ఈ బహుమతి గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన యువ క్రికెటర్‌కు, రాష్ట్ర మంత్రికి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత బలపరిచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *