Ashwini Vaishnaw: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోవట్లేదనీ.. ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయనీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. అంతే కాకుండా 10 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో రైల్వేలో ఎంత అభివృద్ధి జరిగిందో కూడా రైల్వే మంత్రి చెప్పారు. రైల్వే సవరణ బిల్లుపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ హయాంలో గత ఏడాది 5300 కి.మీలతో కలిపి 31,000 కి.మీ రైల్వే ట్రాక్‌లు పెరిగాయని అన్నారు. ఇది స్విట్జర్లాండ్ మొత్తం రైల్వే కవరేజీ కంటే ఎక్కువ అని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: Guinness World Record: గిన్నిస్ బుక్ లో భగవద్గీత
Ashwini Vaishnaw: రైల్వే సవరణ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని రైల్వే మంత్రి అన్నారు. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ఈ విషయంలో తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.రైల్వేస్ సవరణ బిల్లు, 2024ను లోక్‌సభ చర్చ తర్వాత వాయిస్ ఓటింగ్ ద్వారా బుధవారం ఆమోదించింది. బిల్లుపై చర్చకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. రాజ్యాంగంపై చేసిన బూటకపు కథనం లానే, రైల్వేల గురించి విపక్షం అబద్ధపు కథనాలను ప్రచారం చేస్తూందని మంత్రి మండిపడ్డారు.

