Arshdeep Singh: ఆసియా కప్ 2025లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఓమన్ బ్యాటర్ వినాయక్ శుక్లా వికెట్‌ను తీయడం ద్వారా అర్ష్‌దీప్ తన 100వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి అతనికి 64 మ్యాచ్‌లు పట్టింది. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. మొత్తం టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (53 మ్యాచ్‌లు), శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా (63 మ్యాచ్‌లు) అతని కంటే ముందున్నారు.
ఇది కూడా చదవండి: India: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం !
గతంలో టీ20ల్లో భారత తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు) రికార్డు పేరిట ఉండగా, ఇప్పుడు అర్ష్‌దీప్ ఆ రికార్డును అధిగమించాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి ఎనిమిది నెలలు ఎదురుచూడాల్సి వచ్చినా, చివరకు సాధించి చరిత్రకెక్కాడు. ఈ రికార్డుతో అర్ష్‌దీప్ సింగ్ భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.మరోవైపు ఒమన్‌పై టీమ్ ఇండియా 21 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది. శాంసన్(56) రాణించారు. ఒమన్ బౌలర్లలో ఫైసల్, జితెన్, కలీమ్ తలో 2 వికెట్లు తీశారు. ఒమన్ 20 ఓవర్లలో 167/4 రన్స్ చేసింది. కలీమ్(64), మీర్జా(51), జితేందర్(32) మెప్పించారు. హర్షిత్ రాణా, కుల్దీప్, హార్దిక్, అర్షదీప్‌లు తలో వికెట్ తీశారు. అద్భుత ప్రదర్శనతో ఒమన్ హృదయాలు గెలిచింది.