AP News:ఇదేంటి.. కరెంటు తీగలేంటి? ఉయ్యాల ఊగడమేమిటి? విన్యాసాలు చేయడమేంటి? అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఓ వ్యక్తికి అదే బెటర్ అనుకున్నాడు.. కాదు కాదు.. అతని శరీరంలో ఆవరించిన మద్యం అనే మహమ్మారి.. ఆ మహమ్మారి మాట విన్న ఆ యువకుడు ఏకంగా కరెంటు పోల్ ఎక్కేశాడు. తీగలపై ఎంచక్కా పడుకొని ఊయలూగసాగాడు. అయితే కరెంటు పోల్ ఎక్కుతుండగా, చూసిన స్థానికులు చాకచక్యంగా కరెంటు సరఫరాను నిలిపివేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
AP News:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగపురంలో ఓ తాగుబోతు గ్రామస్థులను హడలెత్తించాడు. మద్యం మత్తులో గ్రామం మధ్యలో ఉన్న కరెంటు స్తంభంపైకి ఎక్కేందుకు యత్నించాడు. స్థానికులు ఎంత వారించినా దుర్భాషలాడుతూ హెచ్చరించాడు. స్థానికులు చేసేదిలేక చాకచక్యంగా ట్రాన్స్‌ఫార్మర్ నిలిపి కరెంటు సరఫరాను బంద్ చేశారు.
AP News:ఎవరూ అడ్డుకోకపోవడంతో కరెంటు స్తంభంపైకి ఎక్కనే ఎక్కిండు. పైన పరుచుకొని ఉన్న విద్యుత్ తీగలపై ఎంచక్కా పడుకున్నాడు. కాసేపు హాయిగా కునుకు వేశాడు. మరికొద్దిసేపే ఆ తీగలపైనే విన్యాసాలు చేయసాగాడు. ఎక్కడ జారిపడతాడోనని గ్రామస్థులు బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. ఇదన్నమాట మనోడి వ్యవహారం. అందుకే అంటారు తాగితే ఏదీ కనపడదు అని.. మనోడికి అది కరెంటు.. ముట్టుకుంటే పైకి పోతామని తెలియలేదు మరి.

