CM Revanth Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ నెలలో 14, 15 తేదీల్లో ఆయన ఆదేశంలో, 16న సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఇప్పటికే టూర్ ప్లాన్ ఖరారైంది. ఆయన వెంట ప్రత్యేక బృందం కూడా వెళ్లే అవకాశం ఉన్నది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో పర్యటించిన ఆయన ఇప్పడు ఆస్ట్రేలియా వంతయింది.
CM Revanth Reddy: ఆస్ట్రేలియాలో పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్పోర్ట్స్ చైర్మన్ కూడా వెంట వెళ్లనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని బృందం అక్కడి క్వీన్‌ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నది. ఆ తర్వాత 16న ఆ బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నది. సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలను ఈ బృందం పరిశీలించనున్నది.