AP News: ఇంటికి వచ్చిన పార్శిల్‌ను ఇప్పి చూస్తే.. సచ్చిపోయేంత పనైంది. ఇంటికొచ్చింది సామాను కాదని తెలిసి ఆ ఇంటివాళ్లు భయాందోలనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి విచారణకు దిగారు. కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఓ పేదింటి మహిళ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించగా, వారు పంపిన సామాను అనుకొని ఇప్పి చూడగా, గుండెజారేంత పనైంది.
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా యండగండిలో తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని ఓ మహిళ ఆర్థిక సాయం అడిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఆ మహిళకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ మేరకు ఆమెకు విద్యుత్తు సామగ్రి పంపుతున్నట్టు సమాచారం ఇచ్చారు.
AP News: ఈ మేరకు యండగండిలోని ఆ మహిళ ఇంటికి పార్శిల్ వచ్చింది. ఆనందంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆ పార్శిల్‌ను ఇప్పి చూశారు. అది చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. దానిలో ఉన్నది విద్యుత్తు సామగ్రి కాదు.. గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ ఉన్నది. ఆ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురయ్యారు.
AP News: ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే పోలీసు అధికారులు ఆ ఇంటికి వచ్చి డెడ్‌బాడీని పరిశీలించారు. పార్శిల్ ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు డెలివరీ చేశారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

