AP Cabinet: ఏపీ సచీవాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సిల్ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తేలిపింది. రాష్టంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ భేటిలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది.
ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హెల్త్ పాలసీకి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందేలా కొత్త విధానానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్దిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అందేలా నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఈ బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిది. 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. కేవలం ఆరు గంటల్లో వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆధరైజేషన్ మేనేజ్మెంట్ చేయనున్నారు. మొత్తం 3,257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది. రూ.2.5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకూ ఖర్చు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. ప్రభుత్వం 1.43 కోట్ల పేద కుటుంబాలతో పాటు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు కూడా వర్తించేలా ఈ నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పది ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీపీపీ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో ఈ కళాశాలలను రెండు దశల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేయడానికి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.

