Case on Naa Anveshana: ప్రపంచాన్ని చుట్టేస్తూ, అనేక దేశాల సంస్కృతులు, జీవన శైలులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పాపులారిటీ సంపాదించిన ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ ఈసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులపై చేసిన తప్పుడు ఆరోపణలతో కూడిన వీడియోను తన ఛానెల్‌లో పోస్ట్ చేసిన అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో, అన్వేష్ తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు శాంతికుమారి, దానకిశోర్, వికాస్ రాజ్ వంటి ప్రముఖులు రూ.300 కోట్లు అక్రమంగా ఆర్జించారన్న ఆరోపణలు చేశారు. ఈ మొత్తాన్ని బెట్టింగ్ యాప్‌ల ప్రచార అనుమతుల పేరుతో వసూలు చేశారన్నది అన్వేష్ చేసిన ఆరోపణ. అయితే, ఈ ఆరోపణలకు ఏ విధమైన ఆధారాలు లేవని, ఈ వీడియో పూర్తిగా తప్పుడు సమాచారంతో కూడి ఉందని సైబర్ క్రైం అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Pakistan: వరుసగా 10వ రోజు రూల్స్ బ్రేక్ చేసిన పాకిస్తాన్.. గుణపాఠం చెప్పిన భారత్
ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. వీడియో వల్ల ప్రజల్లో గందరగోళం, అధికారులపై అనవసర నమ్మక లోపం ఏర్పడే అవకాశం ఉందని, ప్రభుత్వ పరిపాలనపై ద్వేష భావాలు రెచ్చగొట్టేలా ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. తద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు.
యూట్యూబ్ ద్వారా విజ్ఞానం పంచే నైపుణ్యాన్ని నిరూపించుకున్న అన్వేష్, ఇప్పటివరకు తన ప్రయాణ వీడియోలతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, ఈ వివాదం అతని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయం. ఇకపై అన్వేషణ కేసుపై ఎలా స్పందిస్తాడో, ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.