AAA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ను ఇటీవల అట్లీ కలిసి స్టోరీ వినిపించగా అందుకు శివ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌లో పాటు ఇటు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కార్తికేయన్. ఇటీవల అమరన్ సినిమాతో అటు కోలీవుడ్ పాటు టాలీవుడ్ లోను బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు అట్లీ మాత్రం బన్నీతో భారీ ఎత్తున సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్రేజీ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ కాంబోకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
