Kalpika

Kalpika: నటి కల్పిక గణేష్‌పై మరో కేసు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య దూషణల ఆరోపణలు!

Kalpika: టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై మరోసారి వివాదం చుట్టుముట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య పదజాలంతో దూషించి, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్పిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో, ఇన్‌బాక్స్ మెసేజ్‌లలో వల్గర్‌గా మాట్లాడినట్లు కీర్తన ఆరోపించింది. ఈ ఆరోపణలకు ఆధారంగా, స్టేటస్‌లు, మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లను పోలీసులకు సమర్పించింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కల్పికపై 67 ITA 2000-2008, 79, 356 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కల్పిక చర్యలపై మండిపడుతుంటే, మరికొందరు ఈ వ్యవహారం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ప్రిజం పబ్‌లో జరిగిన గొడవ కేసులోనూ కల్పికపై ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. ఇలా కల్పిక, వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *