Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి భయంతో రాజీనామా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నా, లేకపోయినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పారు.
మరి విశాఖపట్నం జువెనైల్ హోమ్‌ను సందర్శించిన సందర్భంగా, హోంమంత్రి అనిత మాట్లాడుతూ, పిల్లల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని చెప్పారు. దీన్ని ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే, గత ఐదేళ్ల వైసీపీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
దావోస్ పర్యటన గురించి వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా అనిత స్పందించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం నలుగురుసార్లు దావోస్ సమ్మిట్‌కు హాజరైనప్పటికీ ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేదని గుర్తు చేశారు.
మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగి ఉంటే వైసీపీ నేతలు ఇప్పుడు రోడ్ల మీదికి వచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు.