nara lokesh

Nara Lokesh: ఢిల్లీకి వెళ్లనున్న నారా లోకేశ్.. మోడీతో భేటీ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, టీడీపీ ప్రధాన నాయకుల్లో ఒకరైన నారా లోకేశ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ అయన ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు.

ప్రధానిగా మోదీ పదవిలో ఉన్నప్పటి నుంచే నారా లోకేశ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఢిల్లీకి ఆహ్వానిస్తూ పలు మార్లు ప్రస్తావించారు. తాజాగా అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని హాజరైన సందర్భంగా కూడా లోకేశ్‌ను ప్రత్యేకంగా ఢిల్లీకి రావాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన ప్రధాని అపాయింట్‌మెంట్‌ను పొందిన అనంతరం ఢిల్లీ పయనం అయ్యారు.

ఇది కూడా చదవండి: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం… ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

ఇది కేవలం మర్యాదపూర్వక భేటీగా అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ… రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారంపై చర్చలు జరగే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇక జూన్ మొదటివారంలో అట్టహాసంగా జరిగే చంద్రబాబు ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కేంద్ర మద్దతు, భవిష్యత్తులో రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులపై బీజేపీ సహకారం పొందే ఉద్దేశంతో కూడా లోకేశ్ ఢిల్లీ పర్యటనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP Liquor Scam: మూడు రోజుల సిట్‌ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *