Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన యూరప్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులకు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్న అనంతరం, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. అక్కడి నుంచి యూరప్ పర్యటనకు పయనమవుతారు.
ఈ పర్యటన వ్యక్తిగత స్వరూపంలోనె జరగనుంది. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి యూరప్‌లో కొన్ని రోజులు గడపనున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా, కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే పుట్టినరోజు వేడుకలు జరపనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు ఈ నెల 22వ తేదీన తిరిగి ఢిల్లీ చేరుకోనున్నారు. 23వ తేదీన ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఉర్దూ భాష ఇండియాలోనే పుట్టింది.. ఓ మతానికి ఆపాదించవద్దు
ఇవాళ ఉదయం ఆయన సచివాలయానికి వెళ్లి 16వ ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు, రాత్రికి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరై, ఆ తర్వాత విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు.