PM Modi

PM Modi: మే 10న తెలంగాణకు ప్రధాని మోడీ.. పర్యటన పూర్తి వివరాలు ఇవే!

PM Modi: మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భాగ్యనగరానికి రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీగా నిధులు, అభివృద్ధి పనులను మోడీ కానుకగా ఇవ్వనున్నారు. సుమారు రూ. 7,823 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ‘జన ఆగ్రహ సభ’లో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు.

ప్రధాని పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే:
ప్రధాని పర్యటన మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకు సాగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

* మధ్యాహ్నం 1:10 గంటలకు: బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణం.

* మధ్యాహ్నం 2:20 గంటలకు: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

* మధ్యాహ్నం 2:30 గంటలకు: బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్దే ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ. 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.

* మధ్యాహ్నం 3:45 – 4:15 గంటలకు: హెలికాప్టర్‌లో హైటెక్ సిటీకి చేరుకుని, అక్కడ ‘సాయి సింధు హాస్పిటల్’ను ప్రారంభిస్తారు.

* సాయంత్రం 4:40 గంటలకు: తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

* సాయంత్రం 5:30 గంటలకు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.

* సాయంత్రం 6:30 గంటల వరకు: సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

* రాత్రి 6:45 గంటలకు: బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరుతారు.

ప్రధాని రాక దృష్ట్యా హైదరాబాద్‌లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బేగంపేట, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *