og

OG: ఓజి: ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘ఓజి’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) కోసం అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ ఓజాస్‌తో కనిపించనున్న ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్ట్రామ్’ రిలీజ్ కోసం అభిమానులు ఎప్పుడో నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ పాట విడుదల వాయిదా పడింది. తాజాగా సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఓ కీలక అప్‌డేట్ అందించారు. చిత్రీకరణ బ్యాలన్స్ షూటింగ్ మొదలైన రోజునే ‘ఫైర్ స్ట్రామ్’ పాటను గిఫ్ట్‌గా విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పాటను తమిళ హీరో శింబు ఆలపించడం విశేషం. ఈ అప్‌డేట్‌తో పవన్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ అవతార్‌తో ‘ఓజి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Salman Khan: మరో సౌత్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ మూవీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *