Shivarajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన స్క్రిప్ట్, తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బుచ్చిబాబు డైరెక్షన్ అద్భుతం. స్క్రిప్ట్ అద్వితీయంగా ఉంది. నా పాత్ర చాలా స్పెషల్,” అని శివ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చిత్ర యూనిట్ వెల్లడించిన సమాచారం ప్రకారం, రామ్ చరణ్ పాత్ర అభిమానులకు అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ, యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ డ్రామాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.