Andeshri:ప్రముఖ కవి, గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయహే తెలంగాణ గీతం రచయిత అందెశ్రీ తెలంగాణ సాహిత్యం, కళారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన పాటలు ప్రజల్లో ఎంతో చైతన్యం తెప్పించాయి. ప్రజలను ఆలోచింపజేశాయి. తెలంగాణ మట్టివాసనను తన సాహిత్యంలో మేళవించేవారు. ఆయన 2025 నవంబర్ 10న అకాల మరణంతో తెలంగాణ సాహితీలోకం తీరని శోకంలో మునిగింది. ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నది.
Andeshri:వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన ఒక అనాథగా పెరిగారు. ఆయన ఎలాంటి చదువు సంధ్యలు లేకుండా పెరిగారు. తొలుత గొర్రెల కాపరిగా అందెశ్రీ జీవనప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా కూడా చాలాకాలం పనిచేశారు.
Andeshri:చిన్ననాటి నుంచే ఆశువుగా పాటలు పాడుతుంటే స్వామి శంకర్ మహరాజ్ అందెశ్రీని చేరదీశారు. ఆయనను కళాకారుడిగా స్వామీజీ ఎంతగానో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో ఆశువుగా పాటలు అల్లుతూ పాడుతూ జనాదరణ పొందసాగారు. సాధారణ తెలంగాణ పల్లె జీవనంతో ముడిపడి ఉండే శైలిలో ఆయన పాటలు పాడుతూ ప్రజాకవిగా పేరు పొందారు.
Andeshri:కాలక్రమేణా ఎన్నో ప్రజారంజక పాటలను సొంతంగా రచిస్తూ, పాడుతూ ప్రజల్లో గుర్తింపును దక్కించుకున్నారు. తొలుత వామపక్ష భావజాలం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ గీతాలు ఆలపిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన ఎన్నో పాటలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఆణిముత్యాల్లాంటి పాటలు పాడి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ప్రోత్సాహంతో మరిన్ని పాటలు రాసి పాడారు.
Andeshri:మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. అన్న పాటతో అందెశ్రీ ప్రజల్లో విశేషమైన పేరును సంపాదించుకున్నారు. ఈ మేరకు 2014లో ప్రఖ్యాత పద్మశ్రీ అవార్డుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందె శ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.

