Anaganaga: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుమంత్ నటించిన ‘అనగనగా’ చిత్రం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు సన్నీ సంజయ్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా ఈటీవీ విన్‌లో ఒరిజినల్ చిత్రంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. సుమంత్, మాస్టర్ విహార్ష్‌ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి తెలుగు ఆడియన్స్ తమ స్పందనలను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సుమంత్ నటనతో పాటు చిన్నారి విహార్ష్ పెర్ఫామెన్స్‌కు కూడా అప్లాజ్ దక్కుతోంది. అందరూ ఈ మూవీ చూసేందుకు ఇష్టం పడుతుండటంతో ఈ సినిమా ఏకంగా వంద మిలియన్స్ పైగా స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ఒక పోస్టర్ కూడా వదిలింది. మొత్తానికి ఈ చిత్రం ఓటీటీలో సంచలన హిట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న ‘అనగనగా’ సుమంత్ కెరీర్‌లో మరో విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓటీటీ ప్రియులకు ఓ మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
