Amaravati: తురకపాలెంలో యురేనియం సమస్య లేదని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. అక్కడి నీటిలో యురేనియం అవశేషాలు పరిమిత స్థాయిలో మాత్రమే ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందికరంగా మారే స్థాయిలో లేవని స్పష్టం చేశారు.
ప్రజలు అవసరంలేకుండా ఆందోళన చెందవద్దని సూచించిన అధికారులు, తురకపాలెంలో జీవసంబంధ కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు ఇప్పటికే కొనసాగుతున్నాయని తెలిపారు. కాలుష్యం నియంత్రణ కోసం సంబంధిత విభాగాలు క్రమం తప్పకుండా పరిశీలనలు చేపడుతున్నాయని, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తురకపాలె ప్రజలకు భరోసా ఇస్తూ.. “నీటిలో ఉన్న యురేనియం అవశేషాలు ఆరోగ్యానికి హానికరమైన స్థాయిలో లేవు. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ప్రభుత్వం కాలుష్య సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది” అని తెలిపారు.