Supreme Court: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణపై కీలక పరిణామం చోటుచేసుకున్నది. సీజేఐ ధర్మాసనం నుంచి కేసు విచారణను మరో ధర్మాసనానికి మారుస్తూ మంగళవారం సంచలన నిర్ణయం ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్‌పై బయటే ఉన్నారు. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ మాజీ ఎంపీ, ఇప్పటి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలంటూ రఘురామకృష్ణరాజు మరో పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు.
Supreme Court: సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీపీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపైనా సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆయా కేసుల వాదనలను విన్న సీజేఐ బెంచ్.. తాజాగా సంచలన నిర్ణయం ప్రకటించింది. జగన్ అక్రమాస్తుల కేసును మరో ధర్మాసనానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో బెంచ్ ముందుకు పంపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నది. జగన్ అక్రమాస్తుల కేసు మంగళవారం విచారణకు రాగా, సీజేఐ బెంచ్‌లోని జస్టిస్ సంజయ్ కుమార్, “నాట్ బిఫోర్ మీ” అని చెప్పారు. దీంతో కేసును సీజేఐ జస్టిస్ సంజయ్ ఖన్నా మరో ధర్మాసనానికి మార్చారు. నిర్ణయం ప్రకటించారు.
Supreme Court: గత విచారణ సమయంలోనే జస్టిస్ సంజయ్ కుమార్ “నాట్ బిఫోర్ మీష అని చెప్పినా మంగళవారం విచారణ జాబితాలో మళ్లీ లిస్ట్ అయినట్టు సీజేఐ తెలిపారు. ఈ కేసును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం డిసెంబర్ 2న విచారిస్తున్నదని తేల్చి చెప్పారు. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ జస్టిస్ ఓకా ధర్మాసనమే విచారణ జరుపుతుందని ఆదేశించారు. ఇదిలా ఉండగా, విచారణ ప్రారంభం కాగానే పిటిషన్ ఏపీకి చెందినదని జగన్ తరఫు లాయర్ బెంచ్‌కి వివరించారు. మారిన పరిస్థితుల్లో కౌంటర్ దాఖలుకు కొంత గడువు కావాలని సీబీఐ కోరింది. తమకూ కొంత గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఆ తర్వాతే “నాట్ బిఫోర్ మీ” నిర్ణయం ప్రకటించారు.