OTT: వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కరుణకుమార్ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని అందించటంలో విఫలం అయింది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డిసెంబర్ 5వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుంది. అంటే రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం కానుందన్న మాట. ఇదిలా ఉంటే అదే రోజున శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమా కూడా మరో ఓటీటీ జెయింట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకోసం ఓటీటీ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్. ఇటు ‘అమరన్’, అటు ‘మట్కా’ రెండింటినీ ప్యాన్ ఇండియా భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి థియేటర్లలో నిరాశపరిచిన ‘మట్కా’ ఓటీటీలో ‘అమరన్’తో పోటీ పడి నిలవగలదా! లెట్స్ వెయిట్ అండ్ సీ.