Allu Arjun:

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. కిమ్స్‌కు ఆసుపత్రికి వెళ్లొద్దంటూ నోటీసులు?

Allu Arjun: సినీ న‌టుడు అల్లు అర్జున్ ఇంటికి ఆదివారం ఉద‌యం పోలీసులు చేరుకున్నారు. దీంతో అంత‌టా ఉత్కంఠ నెల‌కొన్న‌ది. పోలీసుల‌కు ఉన్న విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు అల్లు అర్జున్ నిద్ర నుంచి మేల్కొన‌క ముందే చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. నిన్న‌నే నాంప‌ల్లి కోర్టుకు స్వ‌యంగా వెళ్లిన అల్లు అర్జున్ న్యాయ‌మూర్తి ఎదుట సొంత పూచీక‌త్తుపై సంత‌కాలు చేసి వ‌చ్చారు.

Allu Arjun: ఆ మరునాడే తెల్ల‌వారుజామున పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న‌ది. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో తీవ్ర‌గాయాల‌పాలై కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తున్నార‌న్న స‌మాచారంతోనే న‌గ‌రంలోని రాంగోపాల్‌పేట‌ పోలీసులు ఆయ‌న ఇంటికి వ‌చ్చార‌ని తెలిసింది.

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్‌పేట పోలీసులు చేరుకునే స‌రికి ఇంకా ఆయ‌న నిద్ర నుంచి లేవ‌లేదు. శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించేందుకు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుప‌త్రికి వెళ్లొద్దంటూ నోటీసుల‌తో పోలీసులు వెళ్లార‌ని స‌మాచారం. అల్లు అర్జున్ నిద్ర నుంచి లేవ‌లేద‌ని తెలియ‌డంతో ఆయ‌న మేనేజ‌ర్‌కు ఆ నోటీసుల‌ను ఇచ్చార‌ని తెలిసింది.

Allu Arjun: ఇదిలా ఉండ‌గా, పోలీసుల రాక విష‌య‌మై అక్క‌డే ఉన్న కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా, అల్లు అర్జున్ క‌ల‌వ‌డానికి వచ్చామ‌ని, ఆయ‌న లేవ‌క‌పోవ‌డంతో వెళ్తున్నామ‌ని చెప్పారు. నోటీసులు ఇచ్చారా? అని అడ‌గ‌గా, వారు తీసుకోలేదంటూ చెప్తూ వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *