Ostriches: మీరు చూసింది నిజమే.. మనలో కొందరికి కొన్ని పక్షలు రాళ్లు తింటాయనే విషయం తెలుసు. కానీ, ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. ఈ పక్షుల పెంపకందారులు రాళ్లనూ ఆహారంగా పెడుతుంటారు. వాటిని ఎంచక్కా ఇష్టంగా ఆ పక్షలు తినేస్తున్నాయి. కరకరా నమిలేస్తాయి. మరి ఆ రాళ్లు ఎలా కరుగుతాయి. ఎలా జీర్ణం అవుతాయి.. అనేగా మీ డౌట్.
Ostriches: ఆస్ట్రిచ్ పక్షి (ఉష్ట్రపక్షి గ్యాస్ట్రోలిత్ అనే చిన్న రాళ్లను మింగేస్తాయి. ఈ పక్షిని నిప్పుకోడి అని కూడా అంటుంటారు. వాటిని జీర్ణాశయంలో నిల్వ చేసుకుంటాయి. తీసుకునే ఇతర ఆహారాన్ని ఆరాళ్లు నుజ్జుగా చేసి శరీరానికి ఎక్కువ పోషకాలను అందేలా చేస్తాయి. అది ఎలాంటి ఆహారమైనా ఇట్టే కరిగిపోతుందన్నమాట. అందుకే ఈ పక్షల పెంపకందారులు వీటికి కంకర రాళ్లను ఆహారంగా పెడతారు. జీర్ణక్రియలో ముఖ్యమైన ఆహారంగా వీటిని పరిగణిస్తుంటారు. కొంచెం వింతగా అనిపిస్తున్నా ఇది నిజం.