Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరి వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు ఆయన వెళ్లారు. ఇదేరోజు ఉదయం ఆయన ఇంటికి రాంగోపాల్‌పేట పోలీసులు రావడంపై ఉత్కంఠ నెలకొన్నది. అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతోనే వారొచ్చారని తెలిసింది. ఈ మేరకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లొద్దంటూ అల్లు అర్జున్ ఇంటిలో నోటీసులు ఇచ్చారని తెలిసింది.
Allu Arjun: ఇదిలా ఉండగా, ఆ తర్వాత అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు కోసం అల్లు అర్జున్ రెండు రోజుల క్రితం నాంపల్లి ప్రత్యేక కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.50 వేల నగదు, రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
Allu Arjun: నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు. అక్కడి హాజరు రిజిస్టర్‌లో సంతకం చేసి, పోలీసుల ఎదుట హాజరై వెంటనే తిరిగి వస్తారు. ఇలా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్ సంతకం చేసిన వెంటనే తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.