Allari Naresh: అల్లరి నరేష్ నటిస్తున్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ఆల్కహాల్ రిలీజ్ డేట్ మారే అవకాశం కనిపిస్తోంది. 12A రైల్వే కాలనీ ఫ్లాప్ కావడంతో మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ షెడ్యూల్ మారొచ్చని తెలుస్తోంది. అల్లరి నరేష్ రీసెంట్ చిత్రం 12A రైల్వే కాలనీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో ఆ దెబ్బ తన నెక్స్ట్ సినిమాకి తగిలినట్లు కనిపిస్తోంది. ఆయన తదుపరి చిత్రం ఆల్కహాల్ ఇప్పటికే మంచి బజ్ సృష్టించింది.
Also Read: Jaya Bachchan: “వివాహంపై నా సలహా అక్కర్లేదు”: నేటి తరం ఆలోచనలపై జయా బచ్చన్ వ్యాఖ్యలు
మెహర్ తేజ్ దర్శకత్వంలో డార్క్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 1న రిలీజ్ చేయాలని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ఇటీవల అల్లరి నరేష్ కు వరుసగా ఫ్లాప్స్ రావడంతో, అ ప్రభావం వల్ల మరింత జాగ్రత్తగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రిలీజ్ వాయిదా నిజమైతే అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది.

