Alla Nani: ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్లనాని టీడీపీ లో చేరనున్నారు. నేడు మంగళవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు ఆళ్లనాని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గోవాలని సోమవారం సాయంత్రం టీడీపీ కార్యాలయం నుంచి ఆళ్ల నాని కి పిలుపు వచ్చింది. అయన ఏలూరు అసెంబ్లీ నుంచి 4సార్లు మ్మెల్యేగా గెలిచారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దింతో జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి ఆళ్లనాని రాజీనామా చేశారు.
