Cyclone Fengal

Cyclone Fengal: తీరం దాటిన ఫెంగల్.. తమిళనాడులో భారీ వర్షాలు..

Cyclone Fengal: తమిళనాడును వణికించిన ఫెంగల్ తుపాను తీరం దాటి అల్పపీడన జోన్‌గా బలహీనపడటంతో మదురై, దిండిగల్, తేని సహా 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఉత్తర తమిళనాడులోని చాలా ప్రాంతా, కోస్తా జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం వరకు 24 గంటల్లో క్రిష్ణగిరి జిల్లా ఉత్తంగరైలో అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాను నవంబర్ 30వ తేదీ రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్‌గా బలహీనపడింది. నిన్న ఉదయం నాటికి, ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.  ఉత్తర మరియు అంతర్గత జిల్లాలపై వ్యాపించింది.

ఇది కూడా చదవండి: Alla Nani: టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

Cyclone Fengal: ఇదిప్పుడు ఆగ్నేయ, మధ్య అరేబియా సముద్రం మీదుగా కదులుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం డిసెంబర్ 8 వరకు కొనసాగవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *