Akhil Akkineni: తెలుగు సినీ నటుడు అఖిల్ అక్కినేని శుక్రవారం తెల్లవారుజామున తన ప్రేమికురాలు జైనబ్ రవ్జీతో వివాహ బంధంలోకి అడిగారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
వేడుకలో చిరంజీవి కుటుంబం, దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు శర్వానంద్ తదితర సినీ ప్రముఖులు హాజరై కొత్తగా జతకట్టిన జంటను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అఖిల్, జైనబ్ జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్న రిసెప్షన్ వేడుకలో రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. అనంతరం రాజస్థాన్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read: Vishal: విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. రూ.21 కోట్లు చెల్లించాలని ఆదేశం?
జైనబ్ ఎవరు?
జైనబ్ రవ్జీ దిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె భారతదేశంతో పాటు దుబాయ్, లండన్‌లలోనూ థియేటర్ రంగంలో రాణించారు. అఖిల్‌తో ఆమె పరిచయం రెండు సంవత్సరాల క్రితం మొదలై ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ప్రేమ కధ ఇప్పుడు పెళ్లి బంధంగా మారింది. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్జీ మరియు నాగార్జున కుటుంబం మధ్య ఇప్పటికే స్నేహ సంబంధాలు ఉన్నాయి.
గతేడాది నాగచైతన్య – శోభిత వివాహం తర్వాత అక్కినేని ఇంట మరో పెళ్లి వేడుక జరగడం ఇది. ప్రస్తుతం అఖిల్ పెళ్లి వీడియోల్లోని డ్యాన్స్ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. వివాహానంతర వేడుకల కోసం అన్నపూర్ణ స్టూడియో సన్నద్ధమవుతోంది.
View this post on Instagram