Akhil Akkineni: అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. క్లైమాక్స్ షూటింగ్ కోసం అఖిల్ యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Ibomma: ఐబొమ్మ అధికారిక ప్రకటన: దేశవ్యాప్తంగా సేవలు నిలిపివేత
యంగ్ హీరో అక్కినేని అఖిల్ కెరీర్‌లో కీలక చిత్రంగా భావిస్తున్న లెనిన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్లైమాక్స్ కోసం అఖిల్ తీవ్రంగా యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాకుండా క్లైమాక్స్‌లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ – భాగ్యశ్రీ జోడీ లవ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయని టాక్. సినిమా అవుట్‌పుట్ బాగుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంతో అఖిల్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తారని ఆశిస్తున్నారు.

