Akhil-6: అక్కినేని అఖిల్ సరైన హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమాలోకి రాకముందే అఖిల్ ఎంట్రీ పైన చాలానే ఆశలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. కానీ మొదటి సినిమా ఆశించిన రేంజ్ లో లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. తర్వాత వచ్చిన ప్రతి సినిమాకి సమె రిజల్ట్ వచింది. మధ్యలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో మెప్పించిన.. తర్వాత వచ్చిన ఏజెంట్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు.
ఇండస్ట్రీకి వచ్చి 9 ఎళ్ళ అవుతుంది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిసినిమాకి తాను 100% ఇస్తున్నాడు కానీ అభిమానులను మాత్రంమెప్పించలేకపోతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని గ్యాప్ తీసుకుని కథలు ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు తో అఖిల్ సినిమా సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా కథ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ను చేయనున్నారు. దర్శకుడి మొదటి సినిమా కూడా తిరుపతి బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. దీంతో సెంటిమెంట్‌గా షూటింగ్ అక్కడి నుండే మొదలు కానుందట. అయితే తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ పై నాగవంశీ అప్‌డెట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Sreeleela: శ్రీలీలపై అభిమానుల అత్యుత్సాహం.. ప్రమోషన్ ఈవెంట్‌లో షాకింగ్ ఘటన!
ప్రస్తుతం ప్రతి ఫెస్టివల్ కి లేదా నటీనటుల బర్త్ డే లకి వాళ్ళు చేస్తున్న ప్రోజెక్టుల నుండి ఏదో ఒక్క అప్డేట్ ని కచ్చితంగా ఇస్తున్నారు. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు ఉండడంతో తాను చేస్తున్న కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తునట్టు చిత్రయూనిట్ తెలిపింది. నాగవంశీ తన సోషల్ మీడియా అకౌంట్ లో దీనికి సంబందించిన పోస్ట్ ని రిలీజ్ చేశారు. #Akhil 6 టైటిల్ గ్లింప్స్ 08.04.25న రివిల్ చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. అందులో అఖిల్ చేయి మాత్రమే చూపించారు.
#Akhil6 – Title glimpse unveils on 08.04.25 ❤️🔥 @AkhilAkkineni8 @iamnagarjuna @KishoreAbburu @AnnapurnaStdios #ManamEntertainments @SitharaEnts pic.twitter.com/hzWltjRPsk
— Naga Vamsi (@vamsi84) April 7, 2025