Ajith Kumar

Ajith Kumar: తమిళనాట అజిత్ సినిమాకి భారీ వసూళ్లు!

Ajith Kumar: కోలీవుడ్ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ హీరోగా, త్రిష కథానాయికగా దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అజిత్ కెరీర్‌లోనే భారీ హైప్‌తో రిలీజైన ఈ మాస్ హిట్ సినిమా రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. తమిళనాడులో ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తూ, మొదటి వారంలోనే 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రెండు వారాల్లో 170 కోట్లకు పైగా వసూళ్లతో కోలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్‌గా నిలిచింది. ఈ చిత్రం లాంగ్ రన్‌లో 200 కోట్ల మార్క్‌ను అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అజిత్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏ స్థాయిలో రీడిఫైన్ చేస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Actor Siddique: లైంగిక వేధింపుల ఆరోపణలపై నటుడు అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *