Adani Probe: న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో, గౌతమ్ అదానీతో సహా 8 మందిపై వేలకోట్ల విలువైన మోసం – లంచం ఆరోపణలు వచ్చాయి. భారతదేశంలో సౌరశక్తికి సంబంధించిన కాంట్రాక్టులను పొందేందుకు అదానీ భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2110 కోట్లు) లంచాలు ఇచ్చారని లేదా చెల్లించాలని యోచిస్తున్నారని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం పేర్కొంది.
Adani Probe: ఈ మొత్తం వ్యవహారం అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ – మరొక సంస్థకు సంబంధించినది. ఈ కేసు US కోర్టులో అక్టోబర్ 24, 2024 న నమోదైంది. ఇది బుధవారం విచారణకు వచ్చింది. అదానీతో పాటు, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ కాబెనిస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అలాగే రూపేష్ అగర్వాల్ దీనిలో ఇరుక్కున్న ఇతర ఏడుగురు వ్యక్తులు.
Adani Probe: ఈ లంచం సొమ్మును వసూలు చేసేందుకు అదానీ అమెరికా, విదేశీ పెట్టుబడిదారులు, బ్యాంకులకు మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. సాగర్, వినీత్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధికారులు. సాగర్ గౌతమ్ అదానీకి మేనల్లుడు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, గౌతమ్ అదానీ, సాగర్‌లపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
అమెరికా ఇన్వెస్టర్ల సొమ్మును ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టారని, అమెరికా చట్టం ప్రకారం ఆ డబ్బును లంచంగా ఇవ్వడం నేరమని అమెరికాలో కేసు నమోదైంది.
బుధవారం నాడు, 20 ఏళ్ల గ్రీన్ బాండ్ల విక్రయం ద్వారా అదానీ 600 మిలియన్ డాలర్లు (రూ. 5064 కోట్లు) సమీకరించనున్నట్లు ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత, ఆయన మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అదానీపై అమెరికా అటార్నీ కార్యాలయం చేసిన ఆరోపణలు ఇవే !
- 2020 – 2024 మధ్య, అదానీతో సహా నిందితులందరూ భారత ప్రభుత్వం నుండి సౌరశక్తి కాంట్రాక్టులను పొందడానికి భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్లు (రూ. 2110 కోట్లు) లంచం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ ప్రాజెక్ట్ 20 సంవత్సరాలలో $2 బిలియన్ల (రూ. 16881 కోట్లు) కంటే ఎక్కువ లాభాలను ఆర్జించగలదని అంచనా వేశారు.
- పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అదానీ భారత ప్రభుత్వ అధికారిని కలిశారు. ఈ పథకంపై పని చేసేందుకు సాగర్ – వినీత్ అనేక సమావేశాలు నిర్వహించారు.
- సిరిల్ కబానిస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేష్ అగర్వాల్ లంచం ఇచ్చే పథకంపై గ్రాండ్ జ్యూరీ, ఎఫ్బిఐ, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఇసి) దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పన్నారని కోర్టు విచారించింది. నలుగురు కూడా స్కీమ్‌కి సంబంధించిన ఇమెయిల్‌లు, మెసేజ్ లు , విశ్లేషణలను తొలగించారు.
- అదానీ గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్ట్‌కు నిధులు సమకూర్చడానికి అమెరికన్ పెట్టుబడిదారులు -అంతర్జాతీయ రుణదాతల నుండి మొత్తం $ 3 బిలియన్ (రూ. 25321 కోట్లు) సేకరించింది.
ఎవరీ సాగర్ ?
గౌతమ్ అదానీ మేనల్లుడు, సాగర్ బ్రౌన్ యూనివర్శిటీ US నుండి ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. సాగర్ 2015లో అదానీ గ్రూప్‌లో చేరారు. సాగర్ గ్రూప్ ఎనర్జీ బిజినెస్ – ఫైనాన్స్‌ను నిర్వహిస్తారు. ఆయన పునరుత్పాదక ఇంధన వ్యాపారంపై దృష్టి సారించారు. 2030 నాటికి కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారుగా మార్చాలని భావిస్తున్నారు .
నవంబర్ 18న అదానీ ఎనర్జీ షేర్లు పడిపోయాయి
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలు బుధవారం రాత్రి బయటకు వచ్చినప్పటికీ, రెండు రోజుల ముందు నవంబర్ 18 న, అదానీ ఎనర్జీ షేర్లు క్షీణించాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 1.33 శాతం క్షీణతతో ముగిశాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 2.33 శాతం క్షీణించాయి. 1457 వద్ద ముగిసింది. అదానీ టోటల్ గ్యాస్ షేర్ 2.13 శాతం క్షీణతతో రూ.669.60 వద్ద ముగిసింది.
అదానీ గత వారం అమెరికాలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.
అదానీ ఇటీవల అమెరికాలో 10 బిలియన్ డాలర్ల (రూ. 84406 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది, దీని ద్వారా 15,000 ఉద్యోగాలు సృష్టించవచ్చని ప్రకటించారు.
Congratulations to @realDonaldTrump. As the partnership between India and the United States deepens, the Adani Group is committed to leveraging its global expertise and invest $10 billion in US energy security and resilient infrastructure projects, aiming to create up to 15,000… pic.twitter.com/X9wZm4BV2u
— Gautam Adani (@gautam_adani) November 13, 2024

