Mahaa Vamsi Comment

Mahaa Vamsi Comments: నీ ఇంటి రచ్చ చూసుకో.. బురద చల్లటం మానుకో 

Mahaa Vamsi Comments: చింత చచ్చినా పులుపు చావలేదు అని అంటారు. అలా ఉంది వైసీపీ అధినేత, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. తన పార్టీ ఘోర ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలేదు.. తన తల్లి, చెల్లి తనను ఎందుకు వదిలి వెళ్లిపోయారో.. రచ్చ అవుతున్న కుటుంబ వ్యవహారాలును ఎలా చక్కదిద్దుకోవాలో.. అసలు పార్టీని ముందుకు ఎలా నడిపించాలో ఈ విషయాలపై ఎటువంటి క్లారిటీ లేదు. అవసరమైన విషయాలను వదిలేసి.. తనకు మాత్రమే అలవాటైన.. తానూ మాత్రమే చేయగలిగిన అవతలి పక్షంపై బురదజల్లుడు కార్యక్రమాల్లోనే మునిగి తేలుతున్నారు జగన్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తనపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వర్రా రవీంద్రా రెడ్డిని, అతనిని తనపై ఉసిగొలిపిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి ఏ పేలస్ లో దాక్కున్నా సరే బయటకు ఈడ్చుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. తన చెల్లి చేసిన వ్యాఖ్యలపై  వెంటనే స్పందించారు జగన్. 

Mahaa Vamsi Comments: తన చెల్లి తన అన్నపై ఆరోపణలు చేస్తే.. ఆ ఆరోపణలను తప్పని ఖండించాలి. లేదా అసలు జరిగింది ఇదీ అని చెప్పాలి. మరీ కాకపోతే, ఇదంతా కుట్ర అనో.. మరోటో అనో ఏదోఒకటి మాట్లాడాలి. కానీ, అలా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారు? తన ఇంటి బురదను మరొకరి మీద చల్లేస్తే.. ప్రజలకు మొత్తం బురదమయంగా కనిపిస్తుంది. అందులో తన మీద పడ్డ బురద కూడా కలిసిపోతుంది అనే అత్యంత చెత్త ఆలోచన ఆయన చేశారు. డిఫెన్స్ లో పడిపోయిన జగన్.. తన ఇంటి రచ్చ అనే చిన్న గీత ముందు చంద్రబాబు నాయుడి కుటుంబం మీద మచ్చ వేసి పెద్ద గీత గీయాలని ప్రయత్నించారు. ఎప్పుడూ జగన్ చేసే పనే అది. 

Mahaa Vamsi Comments: చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను అసలు పట్టించుకోలేదు.. కుటుంబాన్ని అధికార వ్యామోహంతో పక్కన పెట్టేశారు. తన తల్లిదండ్రులకు తలకొరివి కూడా పెట్టలేదు. ఇవీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక్కడ జగన్ కుటుంబం మొత్తం అంటే, తల్లి, చెల్లి, చిన్నమ్మ, సునీత ఇలా అందరూ జగన్ ను వేలెత్తి చూపించడమే కాకుండా.. పలు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా జగన్ కుటుంబం విషయంలో ఎలా ప్రవర్తించానేది అందరికీ అర్ధం అవుతూనే ఉంది. తల్లి మీద ఆస్తుల కోసం కోర్టులో కేసు వేశారు. చెల్లి మీద తన పార్టీ సోషల్ మీడియాలో దారుణమైన మాటలు వస్తుంటే కిమ్మనలేదు. విజయసాయి రెడ్డి లాంటి వైసీపీలో పెద్ద నాయకులుగా చెప్పుకునేవారు నోటికి వచ్చినట్టు పేస్ మీట్లలో షర్మిలపై దాడి చేస్తుంటే కనీసం పట్టించుకోలేదు. ఈయన కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారు. సరే, ఆయన కుటుంబవ్యవహారాలు.. విలువలు ఆయన ఇష్టం. కానీ, తన కుటుంబ వ్యవహారాల రచ్చ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యవహారాలను లాగడం అత్యంత జుగుప్సాకరమైన రాజకీయం అని చెప్పవచ్చు. 

ALSO READ  Serilingampally: శేరిలింగంపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Mahaa Vamsi Comments: గురివింద గింజల తన కింద ఉన్న నలుపును చూసుకోలేని తనంతో ఎదుటి వారిని చూసి ఏడవడం అనేది సరైన పధ్ధతి కాదనే విషయం ప్రజలు తెలుసుకుంటున్నారు. అసలు జగన్ కి ఏరకంగా చూసినా.. చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా సొంత ఊరు నారావారి పల్లెకు వెళ్లి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తన తల్లిదండ్రులకు ఏ ఇబ్బంది లేకుండా ఊరిలో అన్ని ఏర్పాట్లు చేశారు. మొన్నటికి మొన్న తన తమ్ముడు చనిపోతే.. ఎక్కడో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాబు హుటా హుటిన వచ్చి.. తమ్ముడి అంత్యక్రియలను దగ్గర ఉండి జరిపించారు. అయన కుటుంబానికి తానున్నానని భరోసా ఇచ్చారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడిపైన ఆయన కుటుంబం మీద బురదజల్లటం అంటే ఆకాశం మీద ఉమ్మివేయడం అవుతుంది అనే విషయం జగనోహన్ రెడ్డి తెలుసుకోవాలి. 

Mahaa Vamsi Comments: ఇక్కడ అంశం సోషల్ మీడియాలో తన చెల్లెలు షర్మిల మీద జరిగిన మాటల దాడి. దానికి కారణమైన వారిని చట్టానికి పట్టించడం. దాని విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగ డిమాండ్ చేసి తన చెల్లలు లా ఎవరూ ఇలాంటి సోషల్ మీడియా సైకోల బారిన ఎవరూ పడకుండా చోడాలని కోరాలి. కానీ, నేరం చేశారని చెబుతున్నవారిని వెనకేసుకొని వస్తూ.. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్సించడం  జగన్మోహన్ రెడ్డి దిగజారుడు మనస్తత్వాన్ని ఎట్టి చూపిస్తోంది. ప్రజలు గమనిస్తున్నారు. తప్పొప్పుల లెక్కలు చూస్తున్నారు. తనపై పడిన బురద కడుక్కోకుండా.. ఎదుటి పక్షం వారిపై బురదను జల్లడం అనేది సమంజసం కాదని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు ఇప్పటికే రచ్చ అయిన పరిస్థితుల్లో వాటిని మరింత వీధిన పడకుండా జాగ్రత్త పడే పని చేస్తే ఆయనకు మంచిది. చిన్న గీత ముందు పెద్ద గీత వంటి పనులు చేస్తే రాజకీయాల్లో ప్రజలతో మళ్ళీ మళ్ళీ ఛీ కొట్టించుకునే పరిస్థితి వస్తుందనే విషయం జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా తెలుసుకుంటే, అంత త్వరగా వైసీపీ గాడిన పడుతుంది. లేకపోతే మరింత గందరగోళంగా పరిస్థితి తయారవుతుంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *