Ajith Kumar: అజిత్ మళ్ళీ రేసింగ్ ఎరీనాలో అడుగు పెడుతున్నాడు. దుబాయ్ లో పోర్చే 992 జిటి3 కప్ విభాగంలో మిచెలిన్ 24హెచ్ సీరీస్ లో అజిత్ పోటీపడుతున్నాడు. దీంతో కొంత గ్యాప్ తర్వాత అజిత్ రేసింగ్ కి వచ్చినట్లయింది. నిజానికి అజిత్ కు ఈ మోటార్ రేసింగ్ 18 ఏళ్ళ వయసు నుంచే మొదలైంది. ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్ షిప్ లో తొలిసారి పాల్గొన్న అజిత్ ఆ తర్వాత ఓపెన్ వీల్ రేసింగ్, నేషనల్ ఫార్ములా ఇండియన్ సింగిల్ సీటర్ ఛాంపియన్ షిప్, ఫార్ములా బి.ఎం.డబ్యూ ఆసియన్ ఛాంపియన్ షిప్ లో పోటీపడ్డాడు. రేసింగ్ మాత్రమే తనకు పూర్తి స్థాయిలో తృప్తి ఇస్తుందని ఇటీవల చెప్పిన అజిత్ రేసింగ్ లైనప్ లో జిటి4 2024 ఛాంపియన్ ఫాబియన్ డఫియక్స్, జిటి3 ఛాంపియన్ మ్యాథ్యూ డెట్రి, ఎఫ్4 బ్రిటీష్ ఛాంపియన్ కామ్ మెక్లియోడ్ ఉన్నారు. ఈ టీమ్ కి ఎండ్యూరెన్స్ రేసింగ్ అవుట్ ఫిట్, హ్యాండ్లింగ్ లాజిస్టిక్స్, కార్ మెయింటెనెన్స్ రేస్ స్ట్రాటజీ బాస్ కోటెన్ రేసింగ్ మద్దతు ఇస్తుంది. ఇక మిచిలిన్ 24హెచ్ దుబాయ్ జనవరి 10 నుంచి దుబాయ్ లోని ఆటోడ్రోమ్ లో జరగనుంది. మరి మరోసారి రేసింగ్ ఎంట్రీ ఇస్తున్న అజిత్ అందులో విజయం సాధిస్తాడని ఆశిద్దాం. ఇక అజిత్ నటించిన ‘విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చే ఏడాది సందడి చేయబోతున్నాయి.

