Abbas

Abbas: సంచలనం.. రీఎంట్రీ ఇస్తున్న అబ్బాస్!

Abbas: తమిళ సినిమా పరిశ్రమలో 90వ దశకంలో తన అందమైన లుక్స్, నటనతో యువత హృదయాలను కొల్లగొట్టిన అబ్బాస్ దాదాపు ఒక దశాబ్దం తర్వాత సినీ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 2014లో “రామానుజన్” చిత్రంతో చివరిసారిగా కనిపించిన ఈ నటుడు, ఇప్పుడు జీవీ ప్రకాశ్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న “లవర్” అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న మరియా రాజా ఇళంచెళియన్, ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. గత ఐదారు నెలలుగా అబ్బాస్‌తో చర్చలు జరిపిన ఈ బృందం, ఆయన లుక్, నటనా నైపుణ్యాన్ని ఈ చిత్రంలో సమర్థవంతంగా వినియోగించుకోనుంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభించుకున్న ఈ సినిమా, అబ్బాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *