Mahaboobabad: మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. ఆగివున్న టిప్పర్‌ను వెనుక నుంచి బైక్‌ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి వద్ద జాతీయ రహదారిపై సూధనపల్లి గ్రామానికి చెందిన వల్లపు కుమార్ స్వామి(18) వెంపటి విశాల్(22)ఆగివున్న టిప్పర్‌ను వెనుక నుంచి బైక్ తో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసుల సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
