Aadhi Pinisetty: కార్తి హీరోగా, తమిళ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న మార్షల్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతోంది. ఇందులో విలన్ క్యారెక్టర్ కి ముందుగా మలయాళీ స్టార్ నివిన్ పౌలి ని అనుకుని.. కథ కూడా చెప్పారట. క్యారెక్టర్ నచ్చింది కానీ, డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక తప్పుకున్నాడట నివిన్.
కట్ చేస్తే, ఆది పినిశెట్టిని బ్యాడ్ బాయ్ గా ఫిక్స్ చేశారని అంటున్నారు. సరైనోడు లో వైరం ధనుష్ గా ఆది Performance అదిరిపోతుంది. బాలయ్య అఖండ 2 లోనూ విలన్ గానే కనిపించబోతున్నాడు. మరి మార్షల్ లో తనది ఎలాంటి క్రూషియల్ రోల్ అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ చెప్పలేం.
