A virus that infects dogs: చిన్నపిల్లలు కుక్కలతో సరదాగా ఆటలాడుకోవడం తరచూ అన్ని ఇండ్లలో చూస్తుంటాం. కుక్కలు చిన్నారులను నాకుతూ, రాసుకుంటూ అవి కూడా సరదా తీర్చుకుంటాయి. కానీ ఇదే కొంపలు ముంచేలా ఉన్నది. వాటి ద్వారా పిల్లలకు జబ్బులు సోకుతాయని తరచూ వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నా మనం పట్టించుకోం. కానీ, వీధి కుక్కలతో మధ్య ఆడుకునే ఓ చిన్నారికి కుక్కలకు సోకే వైరస్ వ్యాపించి ఆందోళన పరిస్థితికి దారితీసింది.
A virus that infects dogs: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన నాలుగేండ్ల చిన్నారి చేపూరి శ్రీమేధకు జ్వరం అలర్జీ రావడంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనుషులకు ఎన్ని పరీక్షలు చేస్తారో అన్ని పరీక్షలు చేసి చూశారు. కానీ వ్యాధి నిర్ధారణ కాలేదు. ఆందోళనతో ఆ చిన్నారి తీసుకొని హైదరాబాద్లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
A virus that infects dogs: అక్కడి వైద్యులు చేసిన పరీక్షల్లో గుండుపగిలే నిజం బయటపడింది. బ్రూసెల్లా ఇథిపికల్ అనే వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇది సామాన్యంగా కుక్కలకు వచ్చే వైరస్ అని తేల్చి చెప్పారు. ఆ వైరస్ సోకిన కుక్కల మధ్య ఆ చిన్నారి తరచూ ఆడుకోవడంతో చిన్నారికి కూడా ఆ వైరస్ సోకిందని వైద్యులు తెలిపారు.
A virus that infects dogs: అందుకే కుక్కలతో ఆడుకునే పిల్లలైనా, పెద్దలైనా ఇక నుంచి వాటికి దూరంగా ఉండటమే మంచిది. మరీ వీధి కుక్కల జోలికి అసలే వెళ్లకపోవడమే మంచిది. చిన్నపిల్లలు ఉన్న ఇండ్లకు వీధికుక్కలు రాకుండా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదకరమైన కుక్కలకు సోకే వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉన్నట్టే లెక్క.