The Paradise

The Paradise: ‘ది ప్యారడైజ్’ చిత్రంలో భారీ మార్పు.. ఏంటంటే?

The Paradise: న్యాచురల్ స్టార్ నాని తాజాగా ‘హిట్-3’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు. నాని సరికొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. సినిమాటోగ్రాఫర్‌గా జికె. విష్ణు ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నట్లు సమాచారం. దీంతో చిత్ర యూనిట్ కొత్త టాప్ సినిమాటోగ్రాఫర్ కోసం గాలిస్తోంది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *