Miss World 2025: ప్రపంచ సౌందర్య సమ్మేళనం మిస్ వరల్డ్ 2025 కోసం హైదరాబాద్ సిద్ధమైంది. 72వ ఎడిషన్‌కు వేదికగా నిలిచిన తెలంగాణలో, 140 దేశాల నుంచి అందాల భామలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సుందరీమణులకు తెలంగాణ సంప్రదాయ స్వాగతం లభిస్తోంది.
మిస్ వరల్డ్ 2025 మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీతో ఈవెంట్ ఆరంభం కానుంది, ఇందులో తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలు సందడి చేయనున్నాయి. బ్రెజిల్, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఉక్రెయిన్, శ్రీలంక నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.
Also Read: Dhanashree Verma: చాహల్‌కు షాక్ ఇచ్చిన ధనశ్రీ వర్మ..విడాకుల తర్వాత ఐటమ్ సాంగ్
చార్మినార్, రామప్ప దేవాలయం, బుద్ధవనం, పోచంపల్లి, యాదగిరిగుట్ట వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న ఈ సుందరీమణులు, మే 17న గచ్చిబౌలిలో జరిగే స్పోర్ట్స్ ఫినాలే, మే 22న శిల్పకళా వేదికలో టాలెంట్ ఫినాలేలో పాల్గొంటారు. మే 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలేలో కొత్త మిస్ వరల్డ్ కిరీటం ధరించనుంది. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటే ఈ ఈవెంట్‌లో భారత్‌ను నందిని గుప్తా రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ ఈవెంట్ తెలంగాణ టూరిజాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లనుంది.