Telangana: పెళ్ల‌యిన కూతురు మ‌ర‌ణంపై ఓ తండ్రి వినూత్న‌ తీర్పు!

Telangana: పెళ్ల‌యి అత్తారింట్లో హాయిగా కాపురం చేయాల్సిన త‌న కూతురు ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవ‌డంపై ఓ తండ్రి వినూత్న నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. త‌న కూతురుకు జ‌రిగిన అన్యాయం మ‌రో ఆడ కూతురుకు జ‌ర‌గొద్ద‌ని కోరుకుంటున్నాడు. త‌న కూతురు మ‌ర‌ణానికి వ‌ర‌క‌ట్న వేధింపులే కార‌ణ‌మ‌ని, ఆ వేధింపులు చేసిన వారిని వ‌దిలేది లేద‌ని హెచ్చ‌రికే జారీ చేశాడు. ఏకంగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వారి పేర్లు, ఫొటోల‌తో స‌హా బ‌హిరంగ ప్ర‌దేశంలో ఏర్పాటు చేశాడు.

Telangana: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నారాయ‌ణ‌పేట‌కు చెందిన చ‌న్న‌ప్ప‌గౌడ.. త‌న‌ కూతురు జ‌య‌ల‌క్ష్మిని క‌ర్ణాట‌క‌లోని శంక‌ర్‌ప‌ల్లికి చెందిన శంక‌ర్‌రెడ్డికి ఇచ్చి మూడేండ్ల క్రితం వివాహం జ‌రిపించాడు. రెండేండ్లు ఎలాగోలా కాపురం స‌జావుగానే సాగిన‌ట్ట‌యింది. అయితే ఏడాది క్రితం ఆమె వ‌ర‌క‌ట్న వేధింపుల‌తోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. ఆ తండ్రి తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు.

Telangana: త‌న కూతురు మ‌ర‌ణానికి వ‌ర‌క‌ట్న వేధింపులే కార‌ణమ‌ని పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి. కూతురు మ‌ర‌ణానికి కార‌కులైన వారిపై శిక్ష ప‌డాల్సిందేన‌ని న్యాయపోరాటం చేయ‌సాగాడు. ఏడాది గ‌డిచినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అయినా ఆ తండ్రి వెన‌క్కి త‌గ్గ‌నేలేదు. చ‌ట్టం వ‌దిలినా త‌ను వ‌దిలేద‌ని ప్ర‌తిన‌బూనాడు. వారికోసం వెద‌క‌సాగాడు.

Telangana: నా కూతురు చావుకు కార‌కులైన నా కూతురు భ‌ర్త‌, అత్త, ఇద్ద‌రు ఆడ‌ప‌డుచులు క‌లిసి నా కూతుర్ని క‌ట్నం తేవాల‌ని క‌ట్నం తేవాల‌ని చిత్ర‌హింస‌ల‌కు గురి చేసి అదృశ్య‌మ‌య్యారు. అందుకే ఈ న‌లుగురు వ్య‌క్తులు ఎక్క‌డైనా క‌నిపిస్తే నా ఫోన్ నంబ‌ర్‌కు కాల్ చేయండి.. అని ఆ తండ్రి ఏకంగా ఓ ఫ్లెక్సీనే ఏర్పాటు చేసి జాతీయ ర‌హ‌దారిపై ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీలో ఆ న‌లుగురి చిరునామాను ముద్రించి, వారి ఫొటోలు స‌హా పెట్టించాడు. పైన త‌న కూతురి ఫొటోను చిరునామాతో స‌హా ముద్రించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: తెలంగాణ సీఎస్‌గా కె. రామకృష్ణారావు నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *