Hyderabad: రెండో దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. అలాగే 8,304 వార్డుల్లో కూడా పోటీ లేకుండానే అభ్యర్థులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 3,911 గ్రామాల పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా ముందంజలో నిలిచింది, మొత్తం 44 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నల్గొండ మరియు నిజామాబాద్ జిల్లాల్లో చెరో 38 గ్రామాలు ఏకగ్రీవం కాగా, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం కేవలం ఒక్క గ్రామమే ఏకగ్రీవం కావడం గమనార్హం.

