Neem Benefits: మనం ఏది తిన్నా అది రక్తంలో కలిసిపోతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పుడు దాని కణాలు రక్తంలోకి కూడా చేరుతాయి. మూత్రపిండాలు, కాలేయం వాటిని శుభ్రం చేయడంలో నిమగ్నమవుతాయి. కానీ కొన్నిసార్లు టాక్సిన్స్ చాలా ఎక్కువ అవడంతో కాలేయం, కిడ్నీలు వాటిని తొలగించలేవు. దీంతో అవి రక్తం లోపల పెరిగి శరీరాన్ని దెబ్బతీస్తాయి. అయితే రక్తంలో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించడంలో వేపాకు బాగా పనిచేస్తుంది.
రక్తంలో టాక్సిన్స్ పెరగడం వల్ల
ఆయిల్ ఫుడ్, కాలుష్యం లేదా అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల రక్తంలో టాక్సిన్స్ పేరుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ టాక్సిన్స్ కాలేయం లేదా మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో శరీరం బద్ధకంగా, బలహీనంగా మారుతుంది.
వేప సహజ రక్త శుద్ధి
వేప ఆకు సహజమైన డిటాక్సిఫైయర్. వేప ఆకులు లేదా దాని నీరు శక్తివంతమైన రక్త శుద్ధి. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.
ఇది కూడా చదవండి: Delhi Elections: బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితా విడుదల.. కేజ్రీవాల్ పై పోటీ చేసేది ఎవరంటే..?
ఎలా ఉపయోగించాలి..?
ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 3-4 వేప ఆకులను నమలండి. మరో 5-7 ఆకులను నీటిలో ఉడకబెట్టకుని ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో పేరుకపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.
కడుపు సమస్యల నుంచి రిలీఫ్
వేపాకులు చర్మానికి మాత్రమే కాకుండా పేగుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎసిడిటీ నుంచి రిలీఫ్ ఇస్తాయి. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి ఉదయాన్నే పరగడుపున తాగితే ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వేప జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వల్ల కడుపులో పుండు, మంట, గ్యాస్ తదితర సమస్యలు తొలగిపోతాయి. ఇది మలబద్ధకం సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో మేలు చేస్తుంది:
వేప ఆకులలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాదు జలుబు, దగ్గు మొదలైన వ్యాధులను నయం అవుతాయి.