Namo Bharat:రైల్వే ఆదాయం కోసం వినూత్న తరహాలో ప్రయోగాలకు ఎన్‌సీఆర్‌టీసీ ఎప్పుడూ సిద్ధపడుతూనే ఉన్నది. ఈ సారి మరో వినూత్న ప్రయోగానికి దిగింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) ఆధ్వర్యంలో ఈ సరికొత్త ప్రయోగం చేపట్టాలని నిర్ణయించింది. దీంతో రైళ్లలోనే ప్రైవేటు వేడుకల నిర్వహణను అందుబాటులోకి తెచ్చింది.
Namo Bharat:తొలుత ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో సేవలందిస్తున్న నమో భారత్ రైళ్లలో ఈ వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నది. పుట్టినరోజు వేడుకలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, చిన్నపాటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వంటి కార్యక్రమాలను రైలు కోచ్‌లలో జరుపుకునేందుకు అవకాశం కల్పించింది. రైలు సర్వీస్‌లో ఇలాంటి సదుపాయాలు కల్పించడం దేశంలోని ఇదే తొలిసారి కావడం విశేషం.
Namo Bharat:ఈ కోచ్ బుకింగ్ కోసం గంటకు రూ.5,000 ప్రారంభ ధరగా నిర్ణయించినట్టు ఎన్‌సీఆర్‌టీసీ పేర్కొన్నది. దీనిలో అరగంట డెకరేషన్ కోసం, మరో అరగంట సర్దుకోవడానికి సమయం కేటాయిస్తారు. దీనితోపాటు సినిమా షూటింగ్‌లు, ప్రకటనలు, డాక్యమెంటరీల చిత్రీకరణ కోసం కూడా నమో భారత్ రైళ్లు, స్టేషన్లను కిరాయికి ఇచ్చేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించినట్టు ఎన్‌సీఆర్‌టీసీ తెలిసింది.

