Black or White Salt: వంటగదిలో ఏది ఉన్నా లేకున్నా ఉప్పు మాత్రం తప్పకుండా ఉంటుంది. ఉప్పు లేకుండా ఆహారాన్ని వండలేం. రుచికి సరిపడా ఉప్పు ఉన్నప్పుడే ఆ వంటకు రుచి వస్తుంది. అయితే వంటగదిలో సాధారణంగా రెండు రకాల ఉప్పులు ఉంటాయి. ఒకటి తెల్ల ఉప్పు, మరొకటి నల్ల ఉప్పు. కానీ ఇటీవలి కాలంలో తెల్ల ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పు మంచిది. నల్ల ఉప్పుడు ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల ఉప్పు ఉపయోగాలు :
సాధారణంగా నల్ల లవణాలు ఎక్కువగా చాట్ లేదా ఇతర పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున ఇది సాధారణ ఉప్పు కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Ram Charan: రాజమౌళి-మహేశ్‌బాబు మూవీ విడుదల సమయంఫై రామ్‌చరణ్ అంచనా ఇదే!
ఇందులో సోడియం తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు సమస్య తీవ్రం కాకుడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నల్ల ఉప్పు పొటాషియం యొక్క అద్భుతమైన మూలం. ఇది కండరాలలో సంకోచాన్ని తగ్గిస్తుంది. దీంతో కండరాలు బలపడతాయి.
మలబద్ధకం బాధితులు ఈ ఉప్పును ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. వారికి ఈ సమస్యను ఉపశమనం లభిస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అలాగే బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.