Delhi

Delhi: ఎర్రకోట బ్లాస్ట్ పై పాక్ మీడియా ఏమందంటే..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియా ఈ సంఘటనను విస్తృతంగా ప్రచురించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ టుడే వంటి ప్రముఖ పత్రికలు ఈ ఘటనను తమ తొలి పేజీల్లోనే ప్రాధాన్యంగా ప్రస్తావించాయి.

డాన్ పత్రిక “Delhi’s Red Fort Blast: 8 Killed in Explosion” అనే శీర్షికతో వార్తను ప్రచురించింది. ఈ పేలుడు ఘటనపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు జరుగుతోందని, భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించినట్లు పేర్కొంది.

పాకిస్థాన్ టుడే కూడా ఇదే తరహా శీర్షికను ఇచ్చి, ఢిల్లీలో భద్రతా వ్యవస్థ కట్టుదిట్టం చేయబడిందని రాసింది. జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ పత్రికలు కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించాయి.

ఇక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక “Explosion in Suspicious Car Near Red Fort” అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన అనంతరం భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారని తెలిపింది. అలాగే పేలుడు జరిగిన కారుతో సంబంధం ఉన్న సల్మాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారని పాకిస్థాన్ మీడియా తెలిపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *