Clove Water

Clove Water: లవంగం వాటర్​తో లివర్ సమస్యలకు చెక్

Clove Water: ప్రతీ వంటగదిలో లవంగాలు తప్పక ఉంటాయి. ఇది నోటి రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతే కాకుండా లవంగం నీటిలో వివిధ ఆరోగ్య సమస్యలను తొలగించే శక్తి కూడా ఉంది. అందుకే దీనిని ఇంటి నివారణగా పిలుస్తారు. లవంగం వాటర్​ను రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు తాగాలనేది ఇక్కడ ముఖ్యం. పడుకునే ముందు లవంగం నీరు త్రాగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియకు సహాయపడుతుంది.
సాధారణంగా లవంగం నీటిని తాగడం వల్ల పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చిన్న పిల్లలలో సాధారణంగా కనిపించే కడుపు నొప్పులు, రాత్రిపూట గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంట్లో ఎవరైనా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే వారికి లవంగం నీళ్ళు తాగించడం మంచి పరిష్కారం. జర్నల్ ఆఫ్ ఫార్మకాగ్నోసీ అండ్ ఫైటోకెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. లవంగాలు కడుపు సంబంధిత సమస్యల నుండి రిలీఫ్​ను అందించడంలో బాగా పనిచేస్తాయని తేలింది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి.. జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే మీ రోగనిరోధక శక్తి బలహీనపడి ఉండవచ్చు. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడానికి రోజూ లవంగం నీటిని తాగాలి. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులను నిరోధించే సామర్థ్యాన్ని పెంచుతాయి. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి లవంగం నీరు పనిచేస్తుందని వైద్యులు తెలిపారు.

Also Read: Skincare Tips: బొప్పాయి విత్తనాలతో మొటిమలు మాయం

ఒత్తిడిని తగ్గిస్తుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. లవంగాలలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. పడుకునే ముందు లవంగం నీరు తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపగడి..మంచి నిద్ర వస్తుంది. ఈ నీటిని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

నోటి ఆరోగ్యానికి మంచిది
లవంగాలలో యూజినాల్ ఉండటం వల్ల,అవి నోటి ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. యూజీనాల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చెడు వాసనను నివారించవచ్చు.

కాలేయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది 
లవంగం నీరు తాగడం వల్ల కాలేయం డిటాక్సిఫై అవుతుంది. NIH అధ్యయనం ప్రకారం.. లవంగాలలోని యూజినాల్ కాలేయాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే వాపు, ఆక్సీకరణ ఒత్తిడి మొదలైన కాలేయ రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ALSO READ  Health Tips: ఇంటి భోజనం అయినా సరే ఈ జాగ్రత్తలు పాటించండి

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *