Bhimavaram Murder: పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సుంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న గునుపూడి శ్రీనివాస్ (37) అనే వ్యక్తి తన తల్లి మహాలక్ష్మి (60), తమ్ముడు రవితేజ (33) లను అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంట్లో తల్లి, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి తీవ్రత అధికంగా ఉండడంతో తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులకు నిందితుడి ఫోన్ కాల్.. షాకింగ్ వీడియో
ఈ రెండు హత్యలు చేసిన అనంతరం నిందితుడు శ్రీనివాస్ నేరుగా 112కు ఫోన్ చేసి, తానే హత్య చేశానని లొంగిపోతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హత్యా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది. పోలీసులు తనను అదుపులోకి తీసుకునే ముందు శ్రీనివాస్ మాట్లాడిన మాటలు అతడి మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. శ్రీనివాస్ పోలీసులతో మాట్లాడుతూ, “మా అమ్మ, తమ్ముడు ఇద్దరూ మనుషులు కాదు, దెయ్యాలు. 18 సంవత్సరాల నుంచి నన్ను పీక్కు తింటున్నారు. ఎవరు ఏ విషయం మాట్లాడుకున్నా మా అమ్మకు, తమ్ముడికి ముందే తెలిసిపోతుంది. అందుకే వారిని హత్య చేశాను. చంపేసినా కూడా వారు దెయ్యాలుగా మారి నన్ను వేధిస్తారేమోనని భయంగా ఉంది,” అని చెప్పినట్లు తెలిసింది.
Also Read: Dowry Harassment: సరిపోని కట్నం.. వరకట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
హత్య జరిగిన తీరుపై పోలీసుల విస్మయం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు మృతదేహాల పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తమ్ముడు రవితేజ శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉండగా, తల్లి మహాలక్ష్మి పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చాయి. దీనిని బట్టి నిందితుడు శ్రీనివాస్ వారిని చంపిన తర్వాత కూడా గంటల తరబడి పొడిచి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి
పోలీసుల ప్రాథమిక విచారణలో శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం ఈ దారుణానికి ప్రధాన కారణమై ఉంటుందని తేల్చారు. అయితే, ఇంట్లో జరిగిన విచారణలో నిందితుడు శ్రీనివాస్ మరో కోణాన్ని కూడా వెల్లడించినట్లు తెలిసింది. తల్లి మహాలక్ష్మి నన్ను (పెద్ద కుమారుడిని) ఇంట్లోనే బంధించి, చిన్న కుమారుడైన రవితేజకు ఎక్కువ బాధ్యతలు అప్పగించడం, నన్ను తక్కువగా చూడటం వల్ల సహించలేకపోయాను. అందుకే ఈ పని చేశాను అని నిందితుడు పోలీసు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి, డీఎస్పీ ఆర్.జి జయసూర్య, సీఐ ఎం.నాగరాజు సహా ఇతర పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్ద (తండ్రి) కోవిడ్ సమయంలో మరణించగా, కూతురు బెంగళూరులో నివసిస్తోంది. నిందితుడు శ్రీనివాస్, మృతి చెందిన రవితేజకు ఇంకా వివాహాలు కాలేదు.
పేగు బంధం మరిచి సొంత అమ్మ, తమ్ముడినే చంపిన ఓ వ్యక్తి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ తాను లోపల ఏమి మాట్లాడుకున్నా తన తల్లి, తమ్ముడికి తెలిసిపోతున్నాయని, వారు దెయ్యాలని అనుమానంతో అత్యంత కిరాతకంగా చంపాడు. చంపడానికి ఎంతగా పొడిచినా కత్తి… pic.twitter.com/atTFTsv1wA
— greatandhra (@greatandhranews) November 11, 2025
