Cm chandrababu: మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావిత తీరప్రాంత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ —
తీరప్రాంత ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వారిని తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాలంటీర్ల సహకారంతో సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అధికారులు ఆదేశాలు జార చేసినట్లు సమాచారం.

